Thursday, February 16, 2012

మతసామరస్యం కాపాడండి

ప్రొ// ముదిగొండ శివప్రసాద్‌

 

ఒక క్రైస్తవుడు డాన్‌ బ్రౌన్‌ రచించిన 'ద డావిన్‌స్కీ కోడ్‌' అనే నవల పాశ్చాత్య దేశాలలో లక్షలాది ప్రతులు అమ్ముడుబోయింది. ఇందులోని కథ వాస్తవం అని చెప్పలేము. జీసస్‌ క్రైస్ట్‌కు ఒక భార్య ఉందనీ, ఆమె సంతతివారు నేడు భిన్నభిన్న దేశాలలో నివసిస్తూ ఉన్నారనేది ఇందలి ప్రధాన ఇతివృత్తం. జీసస్‌-మగ్దలీనాల దివ్య సంబంధాలకు మనకు బైబిలు గ్రంథమే ప్రమాణం కాని డాన్‌ బ్రౌన్‌ ఇంగ్లీషు నవల కాదు. పైగా బ్రౌను ఒక కాల్పనిక రచయితయే కాని పురావస్తు పరిశోధకుడు కూడా కాదు. కేవలం కోట్లాది రోమన్‌ కాథలిక్కుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ నవల రచింపబడిందనేది సుస్పష్టం. విచిత్రమేమిటంటే ఈ నవల భారత్‌- అరేబియా వంటి దేశాలలోకన్నా క్రైస్తవం అధికంగా ఉన్న దేశాలలోనే ఎక్కువగా అమ్ముడుపోవడం. ఇది చెత్త నవల అంటూ విమర్శలు వచ్చినా ఆ వ్యాసాలు నవల అమ్మకానికే తోడ్పడ్డాయిగాని నవలా వ్యాపారాన్ని ఆపలేక పోయాయి. ఇదే పాశ్చాత్య ప్రపంచపు దుర్గతి.

ఇంకేం! ఇంత పాప్యులర్‌ నవలను సినిమాగా తీసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన పాశ్చాత్యులకు కలిగింది. కొలంబియా పిక్చర్స్‌వారు దీనిని చిత్రంగా తీసి విడుదల చేస్తే అమెరికా, కెనడా దేశాలలో తొలిమూడు రోజులలోనే 224 మిలియన్‌ల విలువచేసే టిక్కెట్లు అమ్ముడుపోయాయని లాస్‌ ఏంజిల్స్‌ నుండి ఒక రిపోర్టు వచ్చింది. ఈ రెండూ రోమన్‌ కాథలిక్‌ రాజ్యాలే కావడం గమనార్హం. పాశ్చాత్యులకు వ్యాపారం ముందు మతం, సంస్కృతి, నాగరికత సంబంధాలు గౌణం (సెకండరీ) అని అందరికీ తెలిసిందే!! సినిమా తీసిన వారూ చూచినవారూ కూడా ఆ దేశాలలోని క్రైస్తవులే.

బైబిలు ప్రకారం జీసస్‌ చాలా పవిత్రుడు. ఒక యోగిపుంగవుడు. దేవుని పుత్రుడు. అట్టివానిని అవమానించడం ఏ విధంగా చూచినా పాపమే. ఒకరి మత విశ్వాసాలను కించపరిచే అధికారం మరొకరికి లేదు. ఐనా అనాదిగా సాగుతున్నది ఇదే! శ్రీరాముని విగ్రహానికి చెప్పులదండలు వేసి తమిళనాడులో నాస్తిక పార్టీలు వారితో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం దైవదూషణ కాదా? 2004లో మెల్‌గిబ్బన్‌ నిర్మించిన పాషన్‌ చిత్రం చూడవలసిందిగా చర్చిప్రత్యేక ప్రచారం చేసింది. ఐతే ఆ చిత్రంలో తమకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని యూదులు నిరసన తెలిపారు. ఐనా పాశ్చాత్య ప్రపంచం పట్టించుకోలేదు. ఇవ్వాళ మతం కూడా విదేశాలలో ఒక వ్యాపారమే కదా! అందుకే చర్చీలు మూత బడిపోతున్నాయి. వాటిని దేవాలయాలు గురుద్వారాలుగా బ్రిటన్‌లో మార్చారు.
భారతదేశంలో కూడా క్రైస్తవులు ఈ చిత్రంపట్ల నిరసనను ప్రకటించారు. కోర్టులను ఆశ్రయించారు. ఐనా చిత్రం విడుదలను ఆపలేకపోయారు. జీసస్‌ను అవమానిస్తే బాధపడేది క్రైస్తవులే కాదు, హిందువులు కూడా!! ముఖ్యంగా నేను??

జీసెస్‌ చాలాకాలం భారతదేశంలో కాశ్మీరు, టిబెట్టు ప్రాంతాలలో జీవించి విపాసనా ప్రాణాయామం
అభ్యసించాడు. ఆయనను చూడవచ్చిన ముగ్గురు (జాన్‌ శబ్దం) జ్ఞానులూ భారతీయ బుుషులే. బైబిలులో కూడా వారు తూర్పు నుండి వచ్చారని వ్రాయబడి ఉంది ఈ విధంగా జీసస్‌ పై భారతీయులకు మక్కువ ఎక్కువ. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే కొందరి మత విశ్వాసాలను అగౌరవ పరచేవారు శాడిజాన్ని నిరూపించుకోవడం లేదా సొమ్ముచేసుకోవడం నేరం. ఇది డాన్‌ బ్రౌన్‌ విషయంలోనే కాదు సల్మాన్‌ రష్దీ విషయంలోనూ వర్తిస్తుంది. సాటనిక్‌ రైట్స్‌ అను పేరుతో ఇస్లామును విమర్శిస్తూ ఆయన వ్రాసిన గ్రంథానికి అంతర్జాతీయ (అప) ఖ్యాతి వచ్చింది. రష్దీ తలకు ఇస్లామిక్‌ తీవ్రవాదులు వెలకట్టారు. అలాగే ఓ బెంగాలీ రచయిత్రి 'లజ్జ' అనే నవల వ్రాసి ఇస్లామును అవమానించింది. ఆ నవలలో వాస్తవాలు ఉన్నాయా? ఏమో మరి!!
కాని మహమ్మదు గారిని అవమానించడం కూడా తప్పే!! ఆ మధ్య ఎవడో డెన్మార్కు చిత్రకారుడు మహమ్మదుగారి బొమ్మను అవమానకరంగా గీస్తే దానికి ప్రపంచంలోని ముస్లిములందరూ నిరసనలు తెలిపారు. హైదరాబాదులో దహన కాండ జరిగింది. కాని జయేంద్ర సరస్వతిని అరెస్టు చేసినప్పుడు ఒక్క ముస్లిమూ, ఒక్క క్రైస్తవుడూ నిరసన తెలుపలేదు.

ఇదంతా సరే!! మరి మిగిలిన మతాలమాటేమిటి? యం.ఎఫ్‌.హుస్సేన్‌ అనే ఓ చిత్రకారుడు సీత-ద్రౌపది- భారత మాత చిత్రాలను నగ్నంగా చిత్రించినప్పుడు క్రైస్తవులు, ముస్లిములు తాము నిరసన తెలియజేసి హిందూ సోద రులకు అండగా నిలబడితే ఎంతో బాగుండేది! నేడు హుస్సేన్‌ జీవితం పాఠ్యాంశంగా పెట్టారు. జీసస్‌ను ఎవరు విమర్శించినా నేను ఎప్పుడూ ప్రతిఘటిస్తున్నాను. కాని ఒక్క క్రైస్తవుడు కూడా హిందువులను హేతు వాదులు విమర్శించినప్పుడు ఎందుకు సహాయానికి రావటం లేదు??

హేతువాదులకు మతంమీద విశ్వాసం లేదు. మతం నల్లమందు అనేది వారి మూలసూత్రం. అందువల్లనే స్టాలిన్‌ అధికారంలోకి రాగానే మాస్కాలో ఎన్నో చర్చీలు నేలమట్టమైనాయి. ఈ కారణంచేత సామ్యవాద రచయి తలు మతగ్రంథాలను అవమానిస్తూ రచనలు చేయడం సహజం. నేటికి అరవై సంవత్సరాలకు పూర్వం పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి అనే రచయిత ద్రౌపదిని హీనంగా చిత్రిస్తూ రచనలు చేస్తే వాటిని ఎవరూ ఖండించలేదు సరికదా సామ్యవాదులు నెత్తిన పెట్టుకున్నారు. ముప్పాళ్ల రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం అని రాముణ్ణి సీతనూ అవమానిస్తూ ఓ పుస్తకమే వ్రాస్తే దానికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చింది లెఫ్టు వర్గాలే. బైబిలు బండారం అంటూ రాడికల్‌ హ్యూమనిష్టులు సుమారు యాభై సంవత్సరాలకు పూర్వమే ఓ పుస్తకం గుంటూరు జిల్లానుండి ప్రచురించారు. స్వామి దయానంద, సరస్వతి దేవీదేవతలను క్రైస్తవుల బైబిలును మహ్మదీయుల ఖురానును జైనుల మత గ్రంథాలను, బౌద్ధుల త్రిపిటకములను తీవ్రంగా విమర్శిస్తూ సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం వ్రాస్తే అది నేటికీ మన
దేశంలో పారాయణ గ్రంథంగానే ఉంది. నిజాంరాజ్యంలో మాత్రం 1920 ప్రాంతాల్లో కాబోలు నిషేధించారు. ఐనా పుస్తక ప్రచురణ, పఠనం ఆగిపోలేదు. భారతదేశంలో పుష్కరాలు జరుగుతాయి. కృష్ణ , గోదావరి నదులకు పుష్క రాలు వచ్చాయి. అప్పుడు పుష్కరస్నానాలు దోషమనీ వాటివల్ల పుణ్యంరాదనీ కరపత్రాలు పంచి పెట్టారు.

స్వయంగా దేవాదాయ మంత్రిగారి సమక్షంలోనే అమరావతిలోనే ఇలాంటి క్రైస్తవ కరపత్రాలను పట్టుకొని గుంటూరు కోర్టులో కేసులు పెట్టారు. ఆ కరపత్రాలు అచ్చువేసింది, పంపిణీ చేసింది గుంటూరుకు చెందిన ఒక క్రైస్తవ శాఖవారు. ఇలాంటి సంఘటనలు వేలాదిగా జరిగాయి. ఐనా వాటి అన్నింటికీ 'ద డావిన్‌స్కీ కోడ్‌' కు వచ్చినంత అంతర్జాతీయ ప్రాచుర్యం (పబ్లిసిటీ) లభించలేదు.

ఆ మధ్య శ్రీ ఇన్నయ్య అనే విజ్ఞాన హేతువాది 'నిజాలబాట- అబద్ధాల వేట' అనే పేరుతో పురాణాలను సుప్రభాతాలను రామకృష్ణ, వివేకానందులను, అరవిందుణ్ణి, ప్రకాశం పంతులు గారిని మదర్‌ థెరిస్సాను ఇలా ఒకరిని అనేమిటీ భారతీయులు, క్రైస్తవులు ఎవరెవరిని పూజనీయులుగా భావిస్తారో వారందరినీ విమర్శిస్తూ ఓ పుస్తకం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలిగింది? దానిని నిషేధించగలిగిందా?? చౌకబారు ప్రచారం కోసమో, ఆర్థికలాభం కోసమో కొందరి మత విశ్వాసాలను మరికొందరు దెబ్బతీయడం అనాదిగా జరుగుతూనే వచ్చింది. ఖాట్మండుకు నైబుుతీ ప్రాంతంలో నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అరుదైన తాళపత్ర గ్రంథాలయాన్ని మావోయిస్టులు తగులబెట్టారు. అందులో అపురూప పాళీ-మాగధీ-టిబెటన్‌ నేపాలీ- సంస్కృతం భాషా గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవమతస్తుల మీద జరిగే దాడిని హిందువులందరూ మానవుందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అలాగే హిందూజాతి విశ్వాసాలపై అపరిణతమనస్కులైన క్రైస్తవులు పోప్‌జాన్‌ పాల్‌గారు సాగించే దండయాత్రను విద్వాంసులైన క్రైస్తవులూ, పాస్టర్లు రెవరెండ్లు, బిషప్పులు, మౌల్వీలు ముస్లిములూ కూడా ఖండించాలి. అది లెెన ప్పుడు మత సామరస్యం అనేది ఏకపక్షీయ నినాదంగానే మిగిలిపోతుంది. శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చాయి. ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఒక కృష్ణుడు ముగ్గురు రాధలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇలాంటి టైటిల్స్‌తో డజన్లకొద్దీ సినిమాలు వచ్చాయి. వాటికి సెన్సారు సర్టిఫికెట్టు లభించింది. అసలు ఇందులో తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. యమగోలలో 'యముండ'వంటి ఊత పదాలున్నాయి. సంస్కృతి వేరు మతం వేరు వ్యాపారం వేరు అంటున్నారు.
పాశ్చాత్యులు సాంస్కృతిక అనుబంధం కన్నా ధనబంధమే వారి బుుణబంధం. విత్తమే వారి చిత్తం. మెజారిటీ మతోన్మాదం నశించాలి అని టీవీలలో ప్రకటనలు చేసిన కేరళ-బెంగాల్‌లలో 'ద డావిన్‌స్కీ కోడ్‌' ను ఎందుకు నిషేధించలేదో వివరిస్తారా? మతం మత్తుమందు అంటూనే మైనారిటీ మతరక్షణకోసమే పుట్టిన కారణజన్ములుగా తమనుతాము అభివర్ణించుకోవడం కేవలం ఓ ఎత్తుగడ! పదవుల కోసం చెరకుగడ!! అని అనుకోవాలా?? 'ద డావిన్‌స్కీ కోడ్‌' విషవృక్షం-సాటానిక్‌ రైట్స్‌-బైబిలు బండారం, జీసస్‌ పేపర్స్‌, నిజాల బాట వంటి పుస్తకాలను సర్వమత పండిత సభలలో చర్చలకు పెట్టండి. నిజనిజాలు నిగ్గు తేల్చండి. కేవలం నిరసనలవల్ల బస్సులపై రాళ్లు
రువ్వడం వల్ల హైదరాబాదులో థియేటర్లపై దాడి జరగడం పట్ల సత్యశోధన జరగదు!! ఇలాంటి వాటిపై పండితు
లతో సెమినార్లు పెట్టించాలి. సంస్కృత పండితులూ లాటిన్‌ పండితులూ ఒక చోట కూర్చోవాలి. అప్పుడు ధర్మ గంథ్రాలలో ఏముందో తెలుస్తుంది. ఇవ్వాళ మత ప్రచారం చేస్తున్న వారు ఎక్కువమంది నిరక్షరాస్యులు!!
క్రైస్తవ మిత్రులారా నేను జీసస్‌ భక్తుణ్ణి! జీసస్‌ను ఎవరు విమర్శించినా సహించను! కాని మీరు రాత్రిం బవళ్లు హిందూ దేవతలను నిందించటం న్యాయమా?? మతం మార్పిడులు చేయటం దుర్మార్గం కాదా??

 http://www.prabhanews.com/specialstories/article-51937

No comments:

Post a Comment